Mahanubhavudu - All Set For Hat-trick Festival Hitsఈ ఏడాది సంక్రాంతి పండగకు విడుదలైన మూడు సినిమాలు విజయబావుటా ఎగురవేసిన తెలిసిందే. బాలయ్య, చిరులతో పాటు శర్వానంద్ కూడా ‘శతమానం భవతి’ ద్వారా బంపర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో దసరాకు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ‘జై లవకుశ’ విడుదలకు ముందు సామాన్య ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి. కానీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం లేదన్న విషయం తేలిపోయింది.

మొదట విడుదలైన ‘జై లవకుశ’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మరో సినిమా లేకపోవడంతో, కాస్త పర్వాలేదనే పొజిషన్ లో ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘స్పైడర్’ అంతకంటే తక్కువ టాక్ ను సొంతం చేసుకుంది. అంటే ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు కూడా డివైడ్ టాక్ తో ప్రారంభమైనవే. అంటే సంక్రాంతి సెంటిమెంట్ ప్రకారం మూడో సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందా?

పాటలు, టీజర్, ట్రైలర్ అయితే అలాంటి ‘నెగటివ్’ సంకేతాలు ఇవ్వలేదు గానీ, సెంటిమెంట్ ను బలంగా నమ్మే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్స్ సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. అయితే రెండు సినిమాలు నిరుత్సాహ పరచడంతో కనీసం మూడో సినిమా అయినా రంజింప చేస్తుందేమోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మారుతీకి బ్యాక్ గ్రౌండ్ లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఉండడం ప్రధాన ప్లస్ పాయింట్.