Mahanubhavudu Collections fake or realఈ దసరాకు విడుదలైన రెండు పెద్ద సినిమాలు “జై లవకుశ” మరియు “స్పైడర్” కలెక్షన్స్ విషయంలో ‘ఫేక్’ అన్న పదం విరివిగా వినపడిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోనే 125 కోట్లు అంటూ ఒక సినిమా, ఫస్ట్ డేనే 51 కోట్లు అంటూ మరో సినిమా పోస్టర్లు చేసిన రచ్చ తెలియనిది. ఇద్దరు అగ్ర హీరోలు కావడంతో, అభిమానులు రెండు సినిమాల కలెక్షన్స్ పై తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే ఈ రెండింటి తర్వాత సైలెంట్ గా విడుదలైన ‘మహానుభావుడు’ సినిమా మౌత్ టాక్ లో అందరి కంటే ముందుంది.

అలాగే తొలి వారం ముగియడంతో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం ముగిసే సమయానికి 32.31 కోట్ల గ్రాస్ వసూలు సాధించిందనేది “మహానుభావుడు” సినిమా యూనిట్ చెప్తున్న విషయం. ఇది శర్వానంద్ కెరీర్ లోనే అత్యధికం. అంటే శర్వా రేంజ్ ను దాటి భారీ కలెక్షన్స్ ను ప్రకటించినప్పటికీ, ఈ సినిమా విషయంలో “ఫేక్” అన్న పదం ఎక్కడా వినిపించడం లేదు. దీనికి కారణం… రెండు పెద్ద సినిమాలతో పోలిస్తే… పబ్లిక్ టాక్ ఫుల్ పాజిటివ్ గా ఉండడం.

‘టాక్’ పాజిటివ్ గా ఉంటే కలెక్షన్స్ విషయంలో ఎలాంటి వివాదం చెలరేగడం లేదని ‘మహానుభావుడు’ సినిమా ద్వారా మరోసారి నిరూపణ అవుతోంది. కానీ ‘టాక్’లో తేడా ఉండి, కలెక్షన్స్ లో రికార్డులు చూపిస్తే మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మామూలుగా ఉండడలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష – అధికార పక్ష నేతల మధ్య జరిగే వాగ్వివాదాల మాదిరి, చెలరేగిపోతున్నారు. అంటే ‘కలెక్షన్స్’లో కూడా ‘టాక్’ కీలకంగా మారిన నేపధ్యంలో… ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీసి, మంచి ‘టాక్’ను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.