Vijay-Deverakonda---Taxiwaala-Teaser‘అర్జున్ రెడ్డి’ ద్వారా యమా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం టాలీవుడ్ కు ఓ యూత్ ఐకాన్. క్రేజీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోన్న విజయ్ నటించిన “టాక్సీవాలా” చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తనను చూడాలంటే ‘టాక్సీవాలా’ సినిమాలోనే అని చెప్పుకొచ్చాడు విజయ్.

“మహానటి” సినిమాలో తాను కేవలం ఓ అతిధి పాత్రను మాత్రమే పోషించానని, ఈ సినిమాలో నన్ను చూద్దామని వస్తే, అది వాళ్ళ ఫులిష్ నెస్ కు అర్ధమని నిర్మొహమాటంగా చెప్పారు. సావిత్రి గారిని చూడడానికి ఈ సినిమాకు రావాలని, సమంతతో పని చేయడం అనేది తాను ఊహించని విషయాలలో ఒకటని, తనకంటే సీనియర్ అయినా, ఎక్కడా అలా ప్రవర్తించలేదని తెలిపాడు.

ఈ సినిమాలో ‘సావిత్రి’ జీవితం గురించి రీసెర్చ్ చేసే విజయ్ అంటోనీ పాత్రలో కనిపిస్తానని, చాలా తక్కువసేపు ఉంటుందని చెప్పిన విజయ్, భవిష్యత్తులో బాలీవుడ్ కు వెళ్లనని, తెలుగులోనే మంచి సినిమాలు చేస్తానని, “నోటా” సినిమాలో ఓ అగ్రెసివ్ పొలిటిషియన్ గా కనిపించబోతున్నానని, ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారని స్పష్టం చేసారు.