Mahanati-Teaser---Keerthy-Sureshతెలుగు చిత్ర పరిశ్రమ చరిత్ర పుటల్లో సావిత్రి అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. ఆమె తర్వాత ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా… ఆమెను అధిగమించడం గానీ, కనీసం మైమరిపించడం గానీ చేయలేకపోయారు. కళ్ళతోనే హావభావాలను ఎలా ప్రదర్శించాలో సినీ లోకానికి పరిచయం చేసిన సావిత్రి జీవిత కధ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న “మహానటి”పై సర్వత్రా ఆసక్తి ఉండడం సహజమే. మరి ఆ అంచనాలను తాజాగా విడుదలైన ఫస్ట్ టీజర్ ఆ అంచనాలను అందుకుందా? సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ లో పడేసిందా? అంటే…

ఖచ్చితంగా అన్న సమాధానమే వ్యక్తమవుతోంది. ఇది ఒక సినిమా అన్న విషయం పక్కన పెట్టి సావిత్రిని గుర్తు చేసుకుంటూ కీర్తి సురేష్ ను చూస్తుంటే… ఆ మహానటిని మైమరిపించే విధంగా కీర్తి సురేష్ కనపడుతోంది. మరో విధంగా చెప్పాలంటే… బ్లాక్ అండ్ వైట్ లో నేటి కీర్తి సురేష్ ను చూస్తుంటే… నాటి సావిత్రిని చూస్తున్నట్లే ఉందని చెప్పుకోవడం వీక్షకుల వంతవుతోంది. ఫస్ట్ లుక్ లో అపూర్వమైన స్పందనను తెచ్చుకున్న కీర్తి సురేష్, సిల్వర్ స్క్రీన్ పైన ఎలా మాయ చేస్తుందో చూడాలి. అయితే ఒక నిముషంలో పొందిన అనుభూతిని రెండున్నర్ర గంటల పాటు ఉంచాలంటే, సాధారణ విషయం కాదు.