'Mahanati'-Trailer-Cut-Would-Have-Done-Wondersఒకప్పుడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లకు కేరాఫ్ అడ్రస్ వైజయంతీ బ్యానర్. ఈ ప్రొడక్షన్ హౌస్ లో నటిస్తే చాలు, తమకు కావల్సినంత గుర్తింపు లభిస్తుందని సినీజనాలు ఆతృతగా అవకాశాల కోసం ఎదురుచూసే వారు. అయితే ఆ వైభవం గత దశాబ్దంన్నర్రగా వెలవెలబోయింది. ఏ సినిమా తీసినా దారుణమైన పరాజయం తప్ప మరొక ఫలితం చవిచూడలేదు.

2004లో పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమాతో మొదలైన డిజాస్టర్ల జాబితాలో వెంకటేష్ ‘సుభాష్ చంద్రబోస్,’ చిరంజీవి ‘జై చిరంజీవ,’ మహేష్ బాబు ‘సైనికుడు,’ రజనీకాంత్ ‘కథానాయకుడు,’ రామ్ చరణ్ ‘చిరుత,’ (జస్ట్ ఓకే) జూనియర్ ఎన్టీఆర్ ‘కంత్రీ, శక్తి,’ సినిమాలు ఉన్నాయి. చివరగా 2011లో ‘శక్తి’ విడుదలైన తర్వాత సినీ నిర్మాణాలకు ఈ బ్యానర్ దూరమైంది.

2002లో మెగాస్టార్ చిరంజీవితో కొట్టిన ‘ఇంద్ర’ రికార్డే వైజయంతీ బ్యానర్ చివరి విజయం. అయితే “మహానటి” ద్వారా రీ ఎంట్రీ సౌండ్ అదిరిపోయేలా ఇచ్చింది. దీంతో గత వైభవం, వైభోగం వైజయంతీ బ్యానర్ లో తాండవిస్తోంది. ఇదే ఊపులో మహేష్ బాబును 25వ సినిమా నిర్మాణం కూడా చేయనుంది. ప్రిన్స్ ను ‘రాజకుమారుడు’ ద్వారా హీరోగా పరిచయం చేసింది అశ్వనీదత్ అన్న విషయం తెలిసిందే.