mahanati-movie-deleted-scene-missiamma-songసమ్మర్ కు మంచి ఊపు తెచ్చిన “మహానటి” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణాలలో ఇప్పటికీ కలెక్షన్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉండగా, యుఎస్ లో మాత్రం 2.5 మిలియన్ డాలర్స్ ల్యాండ్ మార్క్ దగ్గరకు చేరుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపుగా కష్టసాధ్యంగానే కనపడుతోంది గానీ, ఈ వీకెండ్ లో కాస్త పుంజుకుంటే పెద్ద మ్యాటర్ ఏమీ కాదు.

ఇంత ఘనవిజయం సాధించిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఎడిటింగ్ విభాగంలో కోతకు గురైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒక్కొక్క సీన్ ను యూ ట్యూబ్ లో వరుసగా విడుదల చేస్తూ ఉండగా, ఆ క్రమంలో తాజాగా ‘మిస్సమ్మ’ సినిమాకు సంబంధించిన సీన్ ను రిలీజ్ చేసారు. తమిళంలో కీర్తి సురేష్ – దుల్కర్ ల మధ్య చిత్రీకరించిన ఈ సీన్ ను ఎడిట్ చేయడం సరైన నిర్ణయమే అనిపించే విధంగా ఉంది.