Mahakutami Crunching Numbers, Congress Party First List on- The Wayఒకపక్క మహాకూటమిలో సీట్ల పంపకం అభ్యర్థుల ప్రకటనలకే కిందా మీదా పడుతుంటే తెరాస మాత్రం తన స్పీడ్ ను కొనసాగిస్తోంది. పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం బి-ఫారాలను అందజేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణభవన్‌లో 107 మందికి వీటిని పంపిణీ చేస్తారు.

ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల అభ్యర్థులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒకవేళ రేపు సాయంత్రంలోపు మిగిలిన 12 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైతే వారికి కూడా బి-ఫారాలను అందజేస్తారు. రెండు నెలల క్రితమే సెప్టెంబరు 6న తెరాస అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బి-ఫారాలను అందజేయాలని నిర్ణయించారు. ఒకవేళ రేపటిలోగా మహాకూటమి తన మొదటి లిస్టును ప్రకటించకపోతే అది తెరాసకు నైతికంగా కలిసి వస్తుంది.

బి-ఫారాలను సీఎం కేసీఆర్‌ ఇష్టదైవమైన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెట్టి పూజలు చేసిన అనంతరం వాటిని తెలంగాణభవన్‌కు తరలిస్తారు. ఈ నెల 15న గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. నామినేషన్ వేసాక గజ్వెల్ లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు.