mahakutami-in-andhra-pradeshతెలంగాణాలో కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, మరియు సిపిఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడును గద్దె దించడానికి వామపక్షాలు, జనసేన, బీఎస్పీ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీలతో ఐక్య కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

విజయవాడలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, జనసేన, బీఎస్పీ, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు మహాగర్జనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ ప్రకటన చేశారు. అయితే ఈ కూటమిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ కాంగ్రెస్ లేకుండా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.

అటువంటి కూటమి ఎంతవరకు ప్రభావం చూపగలదో చూడాలి. ఒక్క జనసేన తప్ప ఏ పార్టీ కూడా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. మరోవైపు ఈ కూటమికి జనసేన ఒప్పుకుంటుందో లేదో కూడా తెలీదు. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి పనిచేస్తామనే పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ ఈ కూటమిలో చేరుతుందో లేదో చూడాలి.