Magunta Sreenivasulu Reddy not contesting for elections 2019సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై వైకాపా, తెరాస, కేంద్రం నుండి ముప్పేట దాడి జరుగుతుంది. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పేశారు. తాజాగా మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా చంద్రబాబు కూడా అదే చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుతో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారట.

“ఈడీ, సిబిఐ అని బెదిరిస్తాన్నారు .. అవి ఎదుర్కోలేక కాదు ..ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటున్న క్రెడిబిలిటీ ని ..ఈ కక్ష్య సాధింపు రాజకీయాల కోసం దెబ్బతీసుకోటం ఎందుకని ..పోటీ చెయ్యదలుచుకోటల్లేదు,” అని మాగుంట చంద్రబాబు నాయుడుకి తెలిపారట. ఇటీవలే టీడీపీ గుంటూరు అభ్యర్థి గల్లా జయదేవ్ మీద ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మాగుంటను తమ పార్టీలోకి తీసుకుని రావడానికి వైకాపా, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

గతంలో హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం తరచూ తిరగడం ఇబ్బంది అవుతుందని మురళీ మోహన్, ఆరోగ్య కారణాల వల్ల తోట నరసింహం ఈ సారి పోటీ చెయ్యలేమని తప్పుకున్నారు. తాజా పరిస్థితులను బట్టి వారిని కూడా ఏమన్నా బెదిరించారా అనే అనుమానాలు లేకపోలేదు. గత ఏడాది మర్చిలో కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన నాటి నుండీ ఆ పార్టీ నేతలపై వరుసగా కేంద్ర సంస్థల దాడులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.