maggi-banned-againచిన్న పిల్లలు అమితంగా ఇష్టపడి తినే ఆహార పదార్థాల్లో మ్యాగీ ఒకటి. చిటికేలోనే తయారు అవ్వడంతో పాటు, పిల్లకు ఇష్టమైన రుచిలో ఇవి ఉండటం వల్ల ఇండియాలో వీటి సేల్స్‌ విపరీతంగా ఉంటాయి. అయితే కొన్నాళ్ల క్రితం మ్యాగీ న్యూడిల్స్‌లో మోతాదుకు మించిన సీసం ఉందని, అది పిల్లలతో పాటు, పెద్దలకు కూడా హాని కుగజేస్తుందంటూ పరీక్షల్లో తేలింది. దాంతో మెల్లగా ప్రారంభం అయిన బ్యాన్‌ దేశ వ్యాప్తంగా జరిగింది. కొన్నాళ్లకు మళ్లీ మ్యాగీ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

గతంలో కాకున్నా ఒక మోస్తరుగా అమ్మకాలు జరుపుకుంటున్న మ్యాగీ న్యూడిల్స్‌పై మరో గుదిబండ పడ్డట్లు అయ్యింది. మరోసారి మ్యాగీని పరీక్షించిన ఉత్తర ప్రదేశ్‌ ఫుడ్‌ సేఫ్టీ సంస్థ వారు ఇందులో సీసం మోతాదుకు మించి ఉంది అంటూ నిర్థారించారు. దాంతో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మ్యాగీని బ్యాన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బ్యాన్‌ విధిస్తే మళ్లీ దేశ వ్యాప్తంగా కూడా ఆ బ్యాన్‌ పాకే అవకాశాలు లేక పోలేదు అని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో మళ్లీ మ్యాగీకి కష్టాలు మొదలయ్యాయి. గతంలో మ్యాగీ బ్యాన్‌పై వర్మ వింతగా స్పందించాడు. మరి ఇప్పుడు వర్మ ఈ బ్యాన్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.