Madhavi-Latha-Joins-BJP‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఓ స్థాయిలో వ్యక్తమవుతున్న వేళ…. పవన్ అంటే తనకు ప్రాణమని, పవన్ కు మద్దతుగా మౌనదీక్ష కూడా చేసి వార్తల్లో నిలిచిన మాధవీలత తాజాగా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని మరోసారి హాట్ టాపిక్ గా మారారు. పవన్ పై ఉన్న అభిమానం త్వరలో జనసేన కార్యకర్తనో, నాయకురాలినో చేస్తుందని భావించిన మాధవీలత, ప్రస్తుతం తెలుగు ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్న బిజెపిలో చేరడం విశేషం.

జనసేనలో కాకుండా బిజెపిలో చేరడంపై స్పందిస్తూ… పవన్ అంటే తనకు ఇప్పటికీ అభిమానమేనని, ఆ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుందని, తాను బిజెపిలో ఉన్నా జనసేనకు పూర్తి మద్దతు పలుకుతానని, గతంలో జనసేన స్థాపించినపుడు పవన్ కూడా బిజెపికి మద్దతు తెలిపారని, ఇద్దరి ఐడియాలజీ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. అసలే బిజెపి చేతిలో పావులా మారారని పవన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… తాజాగా మాధవీలత మరిన్ని విమర్శలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయడం విశేషం.