Yet Another Backlash for Jagan Government in Nimmagadda Caseఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ తాను అనుకున్నది సాధించింది. మదనపల్లె రైతు నాగేశ్వరరావు ఎడ్లకు బదులు తన ఇద్దరు కూతుర్లతో తన పొలం దున్నించి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. నటుడు సోనూసూద్ వారి కోసం ఒక ట్రాక్టర్ ని గిఫ్ట్ ఇచ్చారు. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వచ్చి ఆ ఇద్దరు కుమార్తల చదువు బాధ్యతలు తీసుకుంటాం అని ప్రకటించారు.

ఆ ప్రకారంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన మహిళా కాలేజ్‌లో వెన్నెల, చందనలకు ఉచిత హాస్టల్ సదుపాయంతో కూడిన అడ్మిషన్ ఇస్తున్నట్లు తండ్రి నాగేశ్వరరావుకు ఎన్టీఆర్ ట్రస్ట్ లేఖ పంపించింది. అయితే చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే మీడియా ముందుకు వచ్చి థాంక్స్ చెప్పిన ఆ రైతు ఇప్పుడు తనకు చంద్రబాబు సాయం వద్దని చెప్పారు.

చంద్రబాబు ఆ ప్రకటన చెయ్యగానే వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున రైతు పై విమర్శలు చేసింది. అసలు అతను రైతే కాదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని, ఇతర సాయం అవసరం లేదు అంటూ ఆ పార్టీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. వారి ఒత్తిడికి తలొగ్గారు నాగేశ్వరరావు.

ఏ రాజకీయ పార్టీ సాయాన్ని తాను తీసుకోనని చెప్పారు. “నాగేశ్వరరావును నయాన్నో భయాన్నో అధికార పార్టీ తమ దారికి తెచ్చుకుందని అర్ధం అవుతుంది. కేవలం చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని ఈ చర్యకు పూనుకుంది. అమ్మ పెట్టదు అడ్డుకోనివ్వదు అన్న చందాన ఉంది ఈ ప్రభుత్వం వ్యవహారం,” అంటూ తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు.