M kodandaramM kodandaramకాంగ్రెస్ ,సిపిఐలతో పాటు తెలుగుదేశంతో ఏర్పడిన మహాకూటమిలో చేరాలా వద్ద అన్నదానిపై తెలంగాణ జనసమితి తర్జనభర్జన పడుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ డబుల్ గేమ్ , చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం అంటూ అప్పట్లో కోదండరామ్ తీవ్ర విమర్శలు చేసేవారు.

అలాంటిది ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెరాస కు ఉపయోగపడే అవకాశం ఉందా అన్నదానిపై టిజెఎస్ నేతలు తేల్చుకోలేకపోతున్నారు.అయితే అదే సమయంలో అప్పట్లో కేసీఆర్ కోదండరాం దేవుడు అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు దుర్మార్గుడు అని అంటే తప్పు కాదా అని ఇంకొకవర్గం భావిస్తుంది.

అయితే తెలంగాణ జన సమితి మహాకూటమిలో చేరితే మాత్రం కూటమికి ఒక కామన్ మినిమం మేనిఫెస్టో ఉండాలని దానికి కోదండరాం నాయకత్వం వహిస్తేనే మహాకూటమిలో టిజెఎస్ కలుస్తుందని సమాచారం. కోదండరాం కూటమిలో ఉంటే తెలంగాణ వాదులను ఆకట్టుకోవచ్చని మహాకూటమిలోని వారు భావిస్తున్నారట.