రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమా రూపొందింది. రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్న ఈ సినిమాకు అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు లైకా ప్రొడక్షన్స్ వారు చూసుకుంటున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై నెలకొన్న సందేహాల నేపధ్యంలో… లేటెస్ట్ గా ట్వీట్ తో మరిన్ని సందేహాలు తలెత్తేలా చేసారు. ఈ సినిమాను ఫలానా రోజున విడుదల చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఇంతవరకూ మేము అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.
రిలీజ్ డేట్ విషయంలో గానీ… ఈ సినిమాకి సంబంధించిన మరే అనధికారిక స్టేట్మెంట్స్ తో గాని తమకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ వారు చేసిన ప్రకటనతో, ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చని తెలుస్తోంది.