lulu group group international to invest in telanganaదుబాయ్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ ‘లూలూ’ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఆ సంస్థకు భూమిని కూడా కేటాయించారు. రూ.2,200 కోట్ల మేర పెట్టుబడులతో 7 వేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

అయితే ప్రభుత్వం మారిన అనంతరం వారికి కేటాయించిన భూములను కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో పెట్టుబడుల విషయంలో ఆ సంస్థ వెనక్కుతగ్గింది. పైగా ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ లో తాము పెట్టుబడులు పెట్టమని లూలూ గ్రూప్ ప్రకటించింది. తాజాగా ఆ సంస్థ తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అవ్వడం విశేషం.

నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లూలూ గ్రూప్ కు హైదరాబాద్ శివార్లలో 290 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సంస్థ తెలంగాణాలో 2500 కోట్ల పెట్టుబడి పెడుతుండడం విశేషం. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో పెడతాము అన్నదాని కంటే ఎక్కువగా తెలంగాణాలో పెట్టుబడి పెట్టడం విశేషం. పైగా ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ భూమి కేటాయించడం ఇక్కడ కొసమెరుపు. మొత్తానికి జగన్ వద్దు అనుకుంటే కేసీఆర్ ముద్దు అనుకున్నారు. దీనిపై జగన్ ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.