Lovers caught kissing in Hyderabad Metro elevatorsమొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మెట్రో చెడు కారణాలతో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. దీనికి కారణం కొంత మంది యువ ప్రేమికుల కక్కుర్తి. వివరాల్లోకి వెళ్తే రద్దీలేని మెట్రోరైలు స్టేషన్ల లిప్టులు ప్రేమికులకు అడ్డాగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌కు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల్లో ప్రేమికులు కార్యకలాపాలు విస్మయం కల్గిస్తున్నాయి. మెట్రోలోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని తెలియక యువ జంటలు రెచ్చిపోతున్నాయి.

అయితే వారి కక్కుర్తి ముద్దు దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. దీనికంటే ఎక్కువ విస్మయం కలిగించే విషయం ఏంటంటే మెట్రో అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండే సీసీ కెమెరా ఫ్యూటజీ లీక్ కావడం. ఈ ముద్దు సన్నివేశాలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వార్త ఛానళ్ళు కూడా వీటిని ప్రసారం చెయ్యడం విశేషం. ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తుంటారు.

ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట నుండి సీసీ కెమెరా ఫ్యూటజీ ఇది భద్రతా ఉల్లంఘన అనే చెప్పుకోవాలి. సంఘవిద్రోహ శక్తులు దీనిని వాడుకునే అవకాశమూ ఉంది. మరోవైపు కామ కలాపాలను గుర్తించిన మెట్రో అధికారులు ఇప్పటికే స్టేషన్లలో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో హుందాగా ఉండాలనే సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. వైరల్‌గా వీడియోలు మెట్రో అధికారుల దృష్టికి వెళ్లాయి. విచారణ చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మరోవైపు నవంబర్ నెలాఖరుకి హైదరాబాద్ మెట్రో ఏడాది పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది.