Love story movie teaser in theatresఅదేంటి సంక్రాంతి బరిలో అక్కినేని హీరోలు ఎవరు లేరు కదా అనుకుంటున్నారా? సంక్రాంతికి రిలీజ్ లేకపోయినా నాగచైతన్య సంక్రాంతికి రెండు తెలుగురాష్ట్రాలలోని థియేటర్లలో హడావిడి చెయ్యబోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే… నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా టీజర్ రేపు విడుదల అవుతుంది.

ఈ టీజర్ ను సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాల ప్రింట్లకు యాడ్ చేస్తున్నారట. అంటే ఆయా సినిమాల ఇంటర్వెల్ సమయంలో టీజర్ ప్లే అవ్వబోతుంది. సంక్రాంతి హడావిడి అంతా థియేటర్లలోనే ఉంటుంది. పైగా నాలుగు సినిమాలు విడుదల దానితో ఈ సినిమాకు మంచి విజిబిలిటీ రావడం ఖాయంగా కనిపిస్తుంది.

టీజర్ లో సినిమా విడుదల పై క్లారిటీ రావొచ్చు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య.

డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి నాగచైతన్య అప్పుడే తన తదుపరి చిత్రం… థాంక్ యు షూటింగ్ మొదలుపెట్టాడు.

Love story tease in theatres