lokesh comments on jagan about viveka's murder caseతిరుమల వెంకన్న సాక్షిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు తమకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని, జగన్ రెడ్డి కూడా అదే విధంగా ప్రమాణం చేయగలరా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు. అయితే కరోనా కారణంగా 14న తన సభను రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. దీనితో జగన్ తోకముడిచారని టీడీపీ ఎద్దేవా చేస్తుంది.

అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ స్పందన చిత్రంగా ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తుండడంతో.. ఒత్తిడితోనే తన కొడుకును ప్రమోట్‌ చేయాలని చంద్రబాబు ఇటువంటి సవాళ్లు చేసి, ఆ సవాలును సీనియర్లపై ఒత్తిడి తెచ్చి లోకేష్ ను ప్రమోట్ చెయ్యాలని చూస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని వండి వార్చింది.

అసలు ఈ విషయం లో కీలకమైంది ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివేకా కుమార్తె చేసిన పరోక్ష విమర్శలు, అలాగే లోకేష్ చేసిన సవాలు. ఆ సంగతి వదిలిసి లోకేష్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? రాజకీయాలలో ఎవరైనా తమను తాము ప్రమోట్ చేసుకుంటారు అందులో తప్పేముంది? అసలు విషయాన్ని వదిలేసి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ అసలు విషయాన్ని పక్క దారి పట్టిస్తే ఈ విషయంగా ఉన్న అనుమానాలు మరింత ఎక్కువ అవుతాయి.

వివేకా హత్య విషయంలో మొదటి నుండీ వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శల పాలవుతుంది. రక్తం మడుగులో ఉన్న వివేకా మృతదేహాన్ని చూసి కూడా విజయ సాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటు తో మరణించడం దగ్గర నుండి… సీబీఐ విచారణ వద్దు అని ప్రభుత్వం హై కోర్టులో వాదించడం వరకు అన్నీ అనుమానాలకు రేకెత్తించేవిగానే ఉన్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా వివేకా కుమార్తె ఇది ఇంటి దొంగల పనే అనడం అధికార పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది.