lisaa-3d-official-teaser-anjaliఅంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న “లిసా” సినిమా తమిళ టీజర్ విడుదలైంది. భాష వేరైనా భావం అందరికీ అవగతం అయ్యేలా ఈ టీజర్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. హార్రర్, సస్పెన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ను జోడిస్తూ… అద్భుతమైన రీ రికార్డింగ్ తో ఈ టీజర్ ను ఆసక్తిగా మలిచారు.

‘గీతాంజలి’తో హార్రర్ జోనర్ లో ఒక హిట్ అందుకున్న అంజలి, ఆ తర్వాత ‘చిత్రాంగద’ సినిమాతో చేదు అనుభవాన్ని చవిచూసింది. ఈ ‘లిసా’ ప్రమోషన్ మాత్రం ఫస్ట్ పోస్టర్ విడుదల నుండి ఆసక్తికరంగా సాగుతోంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంతోష్ దయానిధి సంగీతం అందించారు.