LIE movie Public talkస్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “లై” సినిమాకు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు లభించిన విషయం తెలిసిందే. అసలు విషయం చెప్పాలంటే… పాజిటివ్ గా స్పందించిన వారి కంటే నెగటివ్ గా చెప్పిన వారే ఎక్కువ. మూడు సినిమాలు విడుదల కాగా, ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ సినిమాల గురించే మాట్లాడుతున్నారు గానీ, ‘లై’ సినిమాను పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు. ఇంతలోనే నెగటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై భారీ ప్రభావమే పడినట్లుగా తెలుస్తోంది.

హను ఈ సినిమాను బాగా స్టైలిష్ గా తెరకెక్కించారు గానీ, అందులో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడం ప్రధాన మైనస్ పాయింట్ గా మారింది. ఏదో తమిళ డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందే తప్ప, ఓ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు అనిపించదు. అందులోనూ ఇలాంటి ‘అండర్ కవర్ కాప్’ సినిమాలు ఇప్పటికే బోలెడు చూసి ఉండడంతో, భారీ ట్విస్ట్ గా చిత్ర యూనిట్ భావించిన నితిన్ క్యారెక్టర్ అలా తేలిపోయింది. ఉన్నంతలో హీరో అర్జున్ క్యారెక్టర్ ఒక్కటే బాగా పండింది.

అయితే ఈ సినిమాకు వెన్నమూకలా నిలిచింది మాత్రం మణిశర్మ సంగీతం అని చెప్పకతప్పదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ… మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలు అనిపించే విధంగా… మణి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చారని చెప్పడంలో సందేహం లేదు. తన నేపధ్యం సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసారు ఈ మెలోడీ బ్రహ్మా. ఇతర రెండు సినిమాలతో పోలిస్తే… బ్యాక్ గ్రౌండ్ సంగీతంలో “లై”కు అందించిన మణిశర్మదే పూర్తి ఆధిపత్యం.