Andhra Pradesh - Bandhఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరగడంతో సర్వత్రా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వామపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ మద్దత్తు ఇస్తున్నట్టు ప్రకటించింది.

మరోవైపు విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం కూడా ఈ బంద్ కు పరోక్ష మద్దత్తు ఇస్తుందట. ఇప్పటికే ముఖ్యమంత్రి నిరసనలను చూసీ చూడనట్టుగా వదిలేయాలని హింసాత్మక ఘటనలు. ఆస్తి నష్టం మాత్రం జరగకుండా చూడాలని చెప్పినట్టు సమాచారం. నిరసనల సెగ ఢిల్లీకి తగలాలని చంద్రబాబు అభిమతం.

ఈ బంద్ తో తమ ఉనికి చాటుకోవాలని వామపక్షాలు ఆరాటపడుతున్నాయి. మరోవైపు వైకాపా కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కాస్త జాగ్రత్తగానే ఉండడం మంచిది. పైగా ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు ఈరోజు రాత్రి బయలుదేరి వెళ్ళబోతున్నారు.