సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలుగుదేశం పార్టీ మరో సరికొత్త ప్రయోగం చేస్తోంది. టిడిపికి చెందిన ఐటిడిపి ప్రతీరోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలను ‘ఐటిడిపి రేడియో’ ద్వారా వినిపిస్తోంది. వాటిలో టిడిపి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, పార్టీలో చాలా మందికి తెలియని ఆసక్తికర విశేషాలు ప్రతీరోజూ వినిపిస్తున్నారు.
ట్విట్టర్‌లో ఈరోజు పోస్ట్ చేసిన ఐటిడిపి రేడియోలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబందం గురించి, 1985 ఎన్నికలలో తను ఎందుకు పోటీ చేయలేదో, 1989లో ఎందుకు పోటీ చేయాల్సివచ్చిందో చంద్రబాబు నాయుడు వివరించారు. ఆ రెండు కీలక నిర్ణయాలతో టిడిపిపై ఎటువంటి ప్రభావం చూపాయో వివరించారు. చాలా క్లుప్తంగా, స్పష్టంగా ఉన్న ఆ ఆడియో సంభాషణలకు మంచి స్పందన వస్తోంది.
బుదవారం ఉదయం సుమారు 11 గంటలకు ‘ఐటిడిపి రేడియో’ను పోస్ట్ చేస్తే గంటలోపే 1,282 మంది దానిని విన్నారు. బహుశః రాబోయే రోజుల్లో టిడిపిలో ముఖ్యనేతలు వారి తర్వాత పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు, బూత్ స్థాయి కార్యకర్తల అభిప్రాయాలు, ఆలోచనలు కూడా వినిపించగలిగితే ఈ పార్టీ మన అందరిదీ… ఇందులో మనమందరం భాగస్వాములమనే భావన అందరికీ కలుగుతుంది. టిడిపిలో అందరి గొంతులు‘ఐటిడిపి రేడియో’ ద్వారా సోషల్ మీడియాలో వినిపిస్తాయి.
— iTDP Official (@iTDP_Official) September 15, 2022