leaked-sambhavami-stills-mahesh-babuప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న “సంభవామి” సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీతో గుజరాత్ షెడ్యూల్ ముగియనుండగా, ఆ తర్వాత ప్రిన్స్ యధావిధిగా కొత్త సంవత్సరం వేడుకల నిమిత్తం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చేక్కేయనున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత జనవరి మొదటి వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన మలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ప్రిన్స్ ను సరికొత్తగా చూపిస్తానని చెప్పిన దర్శకుడు మురుగదాస్, అదీ రీతిలో ప్రిన్స్ ను పరిచయం చేయబోతున్నట్లుగా కనపడుతోంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రిన్స్ వాకింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్ స్టైలిష్ గా ఉండడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 1వ తేదీన విడుదల చేయనుండడంతో, ఆ ఫోటోలలో ప్రిన్స్ ను ఏ విధంగా ప్రజెంట్ చేయబోతున్నారో అనే విషయంపై మరింత స్పష్టత రావచ్చు.