leaked phone call of doctor who treated ys jagan --“జగన్ కోడి కత్తి” ఎపిసోడ్ ఇప్పట్లో తెరపడేలా కనపడడం లేదు. ఓ పక్కన రాజకీయ వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా, మరో పక్కన జరిగేయి జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ కు వైద్యసేవలు అందించిన మహిళా డాక్టర్ ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు రావడం మరో సంచలనానికి నాంది పలికింది.

జగన్ కు 0.5ఎంఎం మాత్రమే కత్తి గుచ్చుకుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, మరి హైదరాబాద్ లో 5 ఎంఎం గుచ్చుకుందని ఎలా అంటారో తనకు తెలియదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సదరు డాక్టర్ మాటలు ఈ ఆడియో క్లిప్ లో వినవచ్చు. అలాగే అపోలో హాస్పిటల్ కు మాత్రమే ఇచ్చిన లేఖ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందోనని భయపడిన విధానం కూడా ఈ ఆడియో క్లిప్ లో క్లియర్ గా ఉంది.

‘మీ పేరు బయటకు వచ్చింది గనుక, జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెతో ఫోన్ లో మాట్లాడే వ్యక్తి సూచనలు చేయడం దేనికి సంకేతాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెళ్ళే సమయంలో జాగ్రత్తలు తీసుకోమని, అవసరమైతే పోలీస్ సాయం తీసుకోవాల్సిందిగా సదరు మహిళా డాక్టర్ కు సూచనలు చేసారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.