bahamas-indiansదేశంలో ఇప్పటివరకు ఎన్నో లీక్స్ బయటపడ్డాయి. ఒకప్పుడు తెహల్కా, ఇటీవల పనామా పేపర్స్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా నమోదైన సంచలనాలు తెలియనివి కావు. అయితే వాటి పర్యవసానాలు ఏమిటి? అంటే మాత్రం నోరెళ్ళబెట్టాల్సిందే. ఈ కోవలోనే తాజాగా ‘బహమాస్ లీక్స్’ పేరుతో ఓ సంచలనాత్మకమైన కధనం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇండియాలో 475 మంది పేర్లతో ఒక లక్షా డెబ్బై అయిదు వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ పేర్కొంది. అసలు విషయం ఏమిటంటే… ఈ 475 మంది జాబితాలో కూడా మన తెలుగు వ్యక్తి నిమ్మగడ్డ ప్రసాద్ పేరు ఉందని తెలుస్తోంది. ఒక వ్యాపారవేత్తగా మార్కెట్ వర్గాలకు నిమ్మగడ్డ ప్రసాద్ ఎంతటి సుపరిచితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు. అలాంటి నిమ్మగడ్డను జైలులో పెట్టించినా, ఒక అక్రమ వ్యవస్థ కేసులో పడేటట్లు చేసినా… ఆ క్రెడిట్ అంతా ఒక్క వైఎస్ జగన్ కు మాత్రమే దక్కుతుంది.

నాటి జగన్ అక్రమాస్తుల కేసులలో సీబీఐ నుండి విచారణను ఎదుర్కొన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపధ్యంలో… మీడియా వర్గాలు సదరు కధనాలను విపరీతంగా ప్రసారం చేయడంతో సెలబ్రిటీగా మారిపోయిన నిమ్మగడ్డ ప్రసాద్, మళ్ళీ చాలా కాలం తర్వాత ‘ బహమాస్’ పేరుతో సరికొత్తగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.