Laxmi-Raai-Hot-in-beachదక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాకపోయినప్పటికీ, స్టార్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ చేసి మాంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ రాయ్ బాలీవుడ్ నాట “జూలీ 2”గా ప్రత్యక్షం కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈ సమ్మర్ లో మరింత హీట్ పుట్టిస్తానని చెప్పిన ఈ బ్యూటీ, ప్రస్తుతం మియామీ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ… సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది.

‘నేను నా హృదయాన్ని అనుసరిస్తాను, అది నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది’ అంటూ మియామీ బీచ్ లో కూర్చున్న ఓ స్టిల్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ అందాల ప్రదర్శనతో పాటు షార్ట్స్ వేసుకుని ఇసుకలో కూర్చున్న లక్ష్మీ రాయ్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమ్మర్ ట్రిప్ గా గత వారం రోజులుగా అమెరికాలో గడుపుతున్న లక్ష్మీ, ఫైనల్ గా కిక్ ఇచ్చే ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను ఆకర్షించింది.