Lavanya Tripathi new avatarసంప్రదాయ కాస్ట్యూమ్స్ తో కూడిన పాత్రలను చేసి చేసి విరక్తి వచ్చిందని, ఏమైనా మోడ్రన్ డ్రెస్ లతో కూడిన క్యారెక్టర్స్ తనకు కావాలంటూ ఓపెన్ గా చెప్పిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ వ్యాఖ్యలకు తగ్గట్లే… ఇటీవల కాలంలో లావణ్య హాజరైన సినీ వేడుకలలో కాస్త గ్లామర్ షోను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఓ అవార్డ్స్ కార్యక్రమంలో అయితే బ్లాక్ గౌన్ లో వచ్చి అందాల విందు చేసి, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే సినీ వేడుకలకే కాదు, ప్రమోషన్ కార్యక్రమాలలో తను కాస్ట్యూమ్స్ ను మార్చిందన్న విషయం తాజాగా స్పష్టమవుతోంది.

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన “యుద్ధం శరణం” సినిమా ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో…. ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగా చిత్ర హీరోహీరోయిన్లు మీడియా వర్గాలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైట్ ఫ్రాక్ వేసుకున్న లావణ్య చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన లాంగ్ లెగ్ సౌందర్యాలను ప్రదర్శిస్తూ… తన అభిమతం ఏమిటో ఆఫ్ ది కెమెరాలలో కూడా లావణ్య చెప్పకనే చెప్తోంది. ఇక దర్శకులే అర్ధం చేసుకోవాలి..!