
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ క్రేజీ కాంబో మూవీ ముహూర్తం విజయదశమికి జరిగింది. నవంబర్ నుండి చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. మొన్న ఆ మధ్య ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖ నేపథ్యంలో ఉంటుందని, గుడులు, వాటి నియంత్రణ బోర్డుల పరిపాలన మీద ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఇది నిజమే అయితే ఆసక్తికరమే. చూడటానికి ఇది చాలా డ్రై సబ్జెక్టు గా కనిపిస్తుంది. దానిని చిరంజీవి స్టయిల్ లో ఎలా కమర్షియల్ గా తీస్తాడో చూడాలి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు తిరు సినిమాటోగ్రాఫర్‌గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు
మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో డైరక్టర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొరటాల.. వరుసగా నాలుగు హిట్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఆయన ప్రతీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ నే సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఆ బంధానికి ఈ సినిమాతో స్వస్తి చెప్పాడు కొరటాల. ముహూర్తం రోజు సాంకేతిక నిపుణుల పేర్లు అన్నీ ప్రకటించినా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ప్రకటించకపోవడం విశేషం.
ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ స్క్రిప్ట్ పై కొరటాల దాదాపుగా రెండేళ్ళు పని చేశారు.
What’s streaming on
OTT? Consult the experts!
Don't MissThe Woman Behind Mahesh Babu's Flawless SkinIf you remember one of Sai Pallavi's recent interviews during the release of her Netflix...
Don't MissThaman's Big Promise to Chiru!SS Thaman is on a roll and on the top of his career at present....
Don't MissTeaser Talk: A Promising Anthology On The HorizonSo, here it is, the long in the gestation period anthology series from Netflix is...
Don't MissBangaru Bullodu Trailer Talk - Naresh Mark EntertainerComedy Star Allari Naresh is going to have the first release in Tollywood after the...
Don't MissThe Biggest Update About Prabhas Disappoints FansSince last night, Prabhas' die-hard fans have been counting every second waiting for the announced...