lanka-trailer-talkమంచి కధ, పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వస్తున్న హర్రర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడుతుండడంతో, ఒకప్పుడు హీరోయిన్ గా చలామణి అయిన ముద్దుగుమ్మ రాశి, తాజాగా ఓ హార్రర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. “లంక” పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడంతో, ఈ ట్రైలర్ ఎలా ఉంటుందోనని ఎదురుచూసిన వారికి తీవ్ర నిరుత్సాహానికి గురిచేసేలా ఉంది.

‘టెలిపతి’ అనే ఒక్క ‘కాన్సెప్ట్’ మినహా ట్రైలర్ లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెండితెరపై అందాలు ఆరబోసిన పాత్రలు చేసిన రాశికి ఈ సినిమా బహుశా కొత్తదనాన్ని పంచిందేమో గానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం… అవే రొటీన్ డైలాగ్ లు, అవే రొటీన్ సీన్లు. కనీసం ఆ రొటీన్ విషయాన్ని అయిన ఆసక్తికరంగా చెప్పారా? అంటే అది లేదు. శ్రీముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక్క రాశి మినహా మిగతా తారాగణం అంతా కొత్తవారే కావడం విశేషం. మరి ఈ ‘టెలిపతి’ కాన్సెప్ట్ తో దర్శకుడు ఏం చేసాడో తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.