Lalu Prasad Yadav Fodder Case1997కు సంబందించిన పశువుల దాణా స్కాంకేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా ప్రకటించిన సీబీఐ స్పెషల్ కోర్టు. 1991-96 మధ్య వెలుగు చూసిన స్కాం దాదాపుగా 900 కోట్లు ఆ రోజుల్లోనే, దేవ్ గడ్ ట్రెజరీ నుండి అక్రమంగా 86 లక్షలు విత్ డ్రా చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలో లాలూ పాత్ర రుజువయ్యింది.

ఇదే స్కాంకు సంబంధించి ఇంకో నాలుగు కేసులలో లాలూ నిందితుడు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చెయ్యబోతుంది కోర్టు. ఇప్పుడు కోర్టులో ఉన్న లాలూను పోలీసులు జైలుకు తరలిస్తారు. మరోవైపు లాలూ కుమార్తె మీసా భారతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జీషీటు దాఖలు చేసింది.

8 వేల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభియోగపత్రాన్ని పటియాల హౌస్‌ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నరేష్‌కుమార్‌ మల్హోత్రాకు సమర్పించింది. మీసా భారతి మీద ఛార్జి షీట్ పడిన కొద్దీ గంటల్లోనే లాలూ జైలుకు వెళాల్సిరావడం గమనార్హం.