lakshmis-ntr-movie-kutr-kutr-kutra-songసంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..తీసే ప్రతీ సినిమాలో కొత్తదనం కోరుకుంటాడో లేదో తెలీదు కానీ…పుబ్లిసిటీలో మాత్రం పీక్స్ కి వెళ్ళిపోతాడు. అయితే తాజాగా వర్మ లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా తెరకెక్కిస్తున్న క్రమంలో ఈ సినిమాకి సంభందించి ఒక పాటను రేపు అంటే 21 డిసెంబర్ న విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే..అందులో వింత ఏముంది అంటే…రేపు వైఎస్ జగన్ పుట్టిన రోజు కావడం, పైగా ఆ పాట “వెన్నుపోటు” అని సాగడం అన్నీ వెరసి వర్మ కావలి అనే ఈ డేట్ ను ఎంపిక చేసుకున్నట్లు..యాంటీ చంద్రబాబు పాటగా దీన్ని ఇదే రోజున విడుదల చేయనున్నట్లు మీడియా కోడై కూస్తుంది.

అయితే ఈ సినిమాకి ఎప్పటినుంచో వైఎసార్సీపీ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్న క్రమంలో వర్మ రేపు అనగా జగన్ పుట్టిన రోజున ఈ పాటను విడుదల చేసి, దానికి హైప్ తెచ్చుకోవాలి అని ప్లాన్ చేస్తుకుంటున్నాడు.

మరి ఇప్పటికే వర్మ తల తిక్క పబ్లిసిటీని బోర్ ఫీల్ అయిన తెలుగు ప్రేక్షకులు…ఈ ఈపాటను ఆదరిస్తారో…లేక లైట్ తీసుకుంటారో…లెట్స్ వెయిట్ అండ్ సీ!