Jr-NTR-Lakshmi-Parvathiఎన్టీఆర్ ఆదరించకపోయుంటే తెలుగు ప్రజలకు లక్ష్మీ పార్వతి ఎవరో తెలిసి ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా ఆమె ఆయన పేరు చెప్పుకొనే బ్రతుకుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆమెను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అంగీకరించలేదు ఇక తెలుగు ప్రజలు ఎలా అంగీకరిస్తారు?అయినప్పటికీ ఎన్టీఆర్ భార్యననే సంగతి ప్రజలకు గుర్తు చేస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబు నాయుడుపై విషం కక్కుతూ మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు.

శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు గనుక ఆమె చంద్రబాబు నాయుడుని ద్వేషించే వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ పదవిని సంపాదించుకోగలిగారు.

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై లక్ష్మీ పార్వతి కూడా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై మరోసారి విషం చిమ్మారు. ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, “జూ.ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి రావాలని కోరుకొనే వాళ్ళలో నేను ముందుంటాను. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. జూ.ఎన్టీఆర్‌ రాజకీయాలలో ప్రవేశించి చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి టిడిపిని స్వాధీనం చేసుకోవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.