Lakshmi Parvathi files reputation case in hyderabad (2)కోటి అనే యువకుడు లక్ష్మి పార్వతి మీద గుంటూరులో లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత సోషియల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డికి కంప్లయింట్ చేశారు వైకాపా నాయకురాలు లక్ష్మి పార్వతి. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను అగౌర పరుస్తూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోటి అనే యువకుడు పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించిన లక్ష్మీపార్వతి. నా పై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తిని బిడ్డలాగా భావించానన్నారు. నా పరువు, మర్యాదలు కాపాడాలని డీజీపీని కోరా.. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలి విజ్ఞప్తి చేశానన్న ఆమె.. డీజీపీ వెంటనే స్పందించి హైదరాబాద్‌ కమిషన్‌కు చెప్పారని.. హైదరాబాద్‌ సీపీకి కలుస్తానని తెలిపారు. అయితే లక్ష్మి పార్వతి నెంబర్ నుండి వచ్చిన అసభ్యకరమైన మెస్సేజ్లకు సంబంధించిన ఆధారాలు కోటి సమర్పించిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తరచుగా తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులను నమ్మము అంటూ తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లక్ష్మి పార్వతి కూడా అదే పని చెయ్యడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మి పార్వతి ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆ పార్టీ తరపున విరివిగా ప్రచారం చేశారు. అయితే పోలింగ్ కు కొంచెం దూరంలో ఈ అభియోగాలు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెను కొంత దూరం పెట్టింది.