Lakshmi Parvathi comments on NTR Biopicఈరోజు ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల సందర్భంగా లక్ష్మి పార్వతి సినిమా పై స్పందించారు. “ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఎన్టీఆర్ చరిత్ర అంతా తీసే ధైర్యం ఉండాలి. అది బాలయ్య కు లేకుండా పోయింది. తీస్తే వాళ్ళ బావని విలన్ గా చూపించాలి. లేకపోతే నన్ను విలన్ గా చూపించాలి. అలా చూపిస్తే నేను ఊరుకోను. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సాక్షలే బోలెడు ఉన్నాయి. ఆయనకు జరిగిన వెన్నుపోటు మీద. అవన్నీ బయట పెట్టి నేను కోర్టుకు వెళ్ళనా? ఎన్టీఆర్ గురించి ఆయన తీసింది సగమే,” అని ఆవిడ అన్నారు.

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయ్యాకే ఎన్టీఆర్ మొత్తం చరిత్ర బయటకు వచ్చినట్టు అని ఆవిడ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చరిత్రను పూర్తిగా చూపించలేనప్పుడు, ఆ ధైర్యం ఆయనకు లేనప్పుడు అది బయోపిక్ అవ్వదు. ఆయన పడ్డ బాధ, క్షోభ చూపించలేనప్పుడు అది బయోపిక్ అవ్వదు. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మా సినిమా విడుదల అయితేనే అది నిజమైన బయోపిక్. సినిమా ప్రీమియర్ కు బాలయ్య తనను పిలవకపోవడాన్ని ఆవిడ తప్పు పట్టారు.

“ఆయన నన్ను పిలిచి అమ్మ సినిమా చుడండి అనాలి. కాకపోతే వారికి ఆ ఇది లేదు. నేను తల్లి స్థానంలో ఉండి నేను బాలయ్య క్రిష్ లకు ఎప్పుడో ఆశీర్వాదం ఇచ్ఛా. అయితే బాలయ్య ఇంకా వారి బావగారి పరిధిలోనే ఉన్నాడు. మంచి వాడే పాపం… ఒరిజినల్ గా మంచి పిల్లాడే (బాలయ్య),” అంటూ లక్ష్మి పార్వతి ముగించారు. లక్ష్మి పార్వతి దృక్కోణం నుండి తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో కలకలం సృష్టిస్తుంది. ఆ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాతలు ఇంకా ఖరారు చెయ్యాల్సి ఉంది.