Lakshmi movie Trailer Talk‘డాన్స్ బేబీ డాన్స్, ఆట, డీ జూనియర్స్’ వంటి చిన్న పిల్లల డాన్స్ షోలు చూసే వారికి “లక్ష్మీ” అనే సినిమా రూపంలో ఓ డాన్సింగ్ ఫీస్ట్ సిల్వర్ స్క్రీన్ పై తళుక్కు,మనబోతోంది. సింపుల్ గా చెప్పాలంటే… లారెన్స్ రాఘవ తీసిన “స్టైల్” సినిమాను చిన్న పిల్లల డాన్స్ పోటీలతో తీస్తే ఎలా ఉంటుందో ప్రభుదేవా “లక్ష్మీ” అలా ఉంటుందని, ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ చెప్తోంది.

విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్ లో కనిపించగా, ట్రైలర్ లో ఈ చిన్న పిల్ల వేసిన స్టెప్స్ వీక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలిచే ప్రభుదేవా డ్యాన్స్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. కధంతా ఈ ట్రైలర్ లో క్లుప్తంగా చెప్పేసారు, డాన్స్ లంటే అమితమైన ఆసక్తి ఉన్న వారికి ఈ నెల 24వ తేదీన వెండితెరపై పలకరించబోతోంది ఈ “లక్ష్మీ.”