Lakshmi Manchu Fire on Web Mediaతమ బతుకు తాము బతుకుంటే వెబ్ సైట్స్, మీడియా తమ ఇష్టానుసారం తమపై రాతలు రాస్తున్నాయంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పందించిన మంచు…. ఓ ఛానల్ లో ఇటీవల జరిగిన చర్చలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ జర్నలిస్టు అసభ్యంగా ప్రశ్నిస్తుంటే ప్రెస్ క్లబ్ ఏం చేస్తోంది? మేము ఊరుకునే కొద్దీ మీరు రెచ్చిపోతారా? మేము డబ్బులిస్తేనే కదా, మా సినిమా గురించి మీరు రాసేది? ఊరికినే ఏమీ రాయట్లేదుగా? అంటూ వెబ్ సైట్స్, మీడియాపై ఆమె మండిపడ్డారు. ఆర్టిస్ట్ లపై ఇష్టానుసారం రాస్తూ, తమను క్షోభకు గురిచేస్తున్నారని, ఇలా చేయడం తగదని అన్నారు.

తన తండ్రి మోహన్ బాబు ప్రస్తుతం ఇక్కడ లేరని, ఆయన ఉండి ఉంటే కనుక ఇలాంటి పిచ్చిరాతలు రాస్తున్న వారిని ఓ రేంజ్ లో కడిగి పారేసేవారని, ప్రశ్నించే వారు లేరు కదా అని చెప్పి ఇష్టానుసారం పిచ్చి రాతలు రాస్తే కుదరదని మంచు లక్ష్మి హెచ్చరించారు. ఇటీవల ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఇండస్ట్రీలో ఉన్న వారిని మరీ అసభ్యంగా మాట్లాడిన వైనం తెలిసిందే.