lahari-music‘1 నేనొక్కడినే’ సినిమా మ్యూజిక్ తో రీ ఎంట్రీ ఇచ్చిన లహరి సంస్థ, అప్పటినుండి దాదాపుగా ప్రతి 90 శాతం పెద్ద సినిమాల ఆడియో హక్కులను సొంతం చేసుకుంటోంది. అయితే తాజాగా 2017 సంక్రాంతికి, సమ్మర్ కు సిద్ధమవుతోన్న పెద్ద సినిమాల ఆడియో హక్కులన్నీ దక్కించుకుందనే సమాచారం అందుతోంది. అంటే తెలుగు సినిమాలకు సంబంధించిన రెండు పెద్ద సీజన్లన్నీ లహరి సంస్థే సందడి చేయనుంది.

ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న ‘మెగా వర్సెస్ నందమూరి’ సినిమాలైన ‘ఖైదీ నంబర్ 150’ మరియు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల ఆడియో హక్కులను కొనుగోలు చేసిన లహరి యాజమాన్యం, సమ్మర్ సెన్సేషన్ గా రాబోతున్న ‘బాహుబలి 2’ హక్కులు కూడా సొంతం చేసుకుంది. ఇక, మిగిలి ఉన్న మురుగదాస్ – మహేష్ సినిమా కూడా లహరి ఖాతాలో వెళ్తుందన్న టాక్ ఉంది. దీంతో రీ ఎంట్రీలో లహరి సంస్థ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.