Lagadapati Survey fears opposition partiesలగడపాటి రాజగోపాల్ కి సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ చేసింది అని చెబుతూ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఒక సర్వే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు, వైకాపాకు 60 సీట్లు, జనసేనకు 5 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేన రాకతో అప్పటి ప్రజారాజ్యం పార్టీలా పాలకపక్షానికి మేలు చేస్తున్నట్టుగా సర్వే చెప్పింది.

అదే సమయంలో ప్రజారాజ్యంకు వచ్చినన్ని ఓట్లు, సీట్లూ కూడా జనసేనకు రావని చెప్పడంతో జనసైనికులు అయోమయంలో పడ్డారు. ఆంధ్రజ్యోతి తెలుగు దేశం పార్టీ అనుకూల మీడియా అని సరిపెట్టుకున్నా వారి అనుమానాలు వారికి ఉన్నాయి. జగన్ పాదయాత్ర పూర్తయిన 10 జిలాలలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది అనే ఊహే వైకాపాను భయపెడుతుంది.

మరోవైపు ప్రజారాజ్యం కంటే తక్కువ ప్రభావం అనే విషయాన్నీ జనసైనికులు జీర్ణించుకోవడం లేదు. ప్రజారాజ్యం దెబ్బకు జనసేన విశ్వనీయత దెబ్బతిందా అనే అనుమానాలు కలగడం సహజం. దీనితో లగడపాటి సర్వే నిజమైతే ఏంటి పరిస్థితి అని ప్రతిపక్షాలు మధనపడుతున్నాయి.