Lagadapati Rajagopal reveals about his surveyఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండడంతో తెలుగు ప్రజానీకమంతా ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. సర్వేల విషయంలో 100% కచ్చితత్వం ఉండటంతో ఆయన సర్వేలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ఆయన ప్రస్తుతానికి గుంభనంగా ఉండడంతో అందరిలో చాలా ఉత్కంఠ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు బట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, 2019 జనరల్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో తనకు కచ్చితమైన సర్వే ఫలితాలు ఎలా వస్తుంటాయి అనేది ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరంగా చెప్పారు.

“సర్వే చేసే అప్పుడు మనం తీసుకునే శాంపిల్ తో సంబంధం ఉండదు. చాలా మంది పెద్ద శాంపిల్ ఉంటె సర్వే కచ్చితం అంటారు. కాకపోతే తక్కువ శాంపిల్ అయినా మనం ఎంచుకునే సర్వే మనుషుల బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఐదు నియోజకవర్గాలలో 50 మందిని అడిగి ఆంధ్రప్రదేశ్ సర్వే చెప్పెయ్యొచ్చు. ఆ 50 మందిని ఎన్నుకోవడంలోనే సర్వే విజయం ఆధారపడి ఉంటుంది. ఎవరికీ ఎన్ని వస్తాయో చెప్పలేం కానీ ఎవరు గెలుస్తామో చెప్పేయొచ్చు,” అని అన్నారు ఆయన.

“సెల్ ఫోన్ లతో చేసే సర్వేలలో ఎప్పుడూ కరెక్టుగా చెప్పలేము. ఇటీవలే మేము కర్ణాటక లో సెల్ ఫోన్ సర్వేతో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేసాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అలానే చేశాం. రెండిటికి చాలా తేడా ఉంది. కాబట్టి ఫోన్ సర్వే అనేది బోగస్. అదే విధంగా ఓటర్లలో సైలెంట్ ఓటర్లు, వోకల్ ఓటర్లు అని రెండు రకాలు ఉంటాయి. సైలెంట్ ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టం. ఆ సైలెంట్ ఓటర్ల వల్లే టీడీపీ అంత భారీగా గెలిచింది. వోకల్ ఓటర్లను బట్టి అందరూ హోరాహోరీ అనుకున్నారు,” అని చెప్పారు.

“సైలెంట్ ఓటర్ల మనోగతం మారుతూ ఉంటుంది. వారు న్యూస్ ఛానెల్స్ చూడరు. వారి నాడి పట్టుకోవడం కష్టం. వారి పల్స్ పట్టుకోవడం సర్వే సక్సెస్ కు కీలకం. ఎన్నికలకు 10-15 రోజుల ముందు చేసే సర్వేలు కచ్చితమైన ముందుగా సర్వే చేసుకుంటే పబ్లిక్ పల్స్ ఎలా మారుతుందనేది తెలుస్తుంది. ఆ మార్పును కచ్చితంగా ట్రాక్ చేస్తేనే మనకు సరైన రిజల్ట్స్ వస్తాయి,” అన్నారు రాజగోపాల్. డిసెంబర్ 5 లోగా నాలుగు రాష్ట్రాల సర్వే ఫలితాలు తన వద్ద రెడీగా ఉంటాయని, పోలింగ్ అయ్యాక బయటపెడతా అని ఆయన అన్నారు.