L V Subramanyamఅవినీతి కేసులలో నిందితుడు అని చంద్రబాబు నాయుడు అంటే ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాలా కోపం వచ్చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి రివ్యూ మీటింగు పెడితే కూడా వెళ్ళని స్థాయికి ఆయన ఈగో చేరిపోయింది. ఇది ఇలా ఉండగా ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పుడే చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే నెల్లూరులోని సింహపురి హాస్పిటల్రో డ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి భారీగా బిల్లు వేసింది. బిల్లు మాఫీకి బంధువులను బ్లాక్ మెయిల్ చేసి ప్రతిఫలంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్, ఇతర వైద్యాధికారులు విచారణ జరిపి సింహపురి ఆస్పత్రి దారుణానికి పాల్పడిందని నిర్ధారించి .. చర్యలకు సిఫార్సు చేశారు. అయితే ఈలోగా ఆసుపత్రి యాజమాన్యం ఎల్వీని కలిసింది. కలెక్టరు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి ఇంకో డీఎంఈ నేతృత్వంలో విచారణ కమిటి వేశారు ఎల్వీ. తెలివిగా ఆ నివేదిక కలెక్టరుకు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఇది వివాదాస్పదం అయితే తన మీదకు రాకుండా వ్యవహరించారు. అయితే ఎల్వీ ఆలోచనను పసిగట్టి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వమని కోరారు సదరు డీఎంఈ.

ఆయనకూడా ఆసుపత్రిదే తప్పు అని తెలుస్తూ ఇంకో రిపోర్టు ఇచ్చేశారు. అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని ఆసుపత్రి వర్గాలు ఒత్తిడి చేసినా ఎల్వీ చేయబోయిన మోసాన్ని గ్రహించి ఆ డీఎంఈ న్యాయబద్దంగా రిపోర్టు ఇచ్చారు. పాపం అధికార దుర్వినియోగానికి పాల్పడినా… ఫలితం దక్కడం లేదు ఎల్వీకి. ఇప్పుడు ఆ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కు సిఫార్సు చేయడం మినహా చేయగలిగిందేమీ లేదు.