l-v-subrahmanyam-ias-ys-jaganఎన్నికల సంఘం చేత నియమింపబడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారిపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను రిటైర్డ్‌ ఐఏఎస్‌ బృందం కోరింది. ఇప్పటికే ఈ బృందం మీరు చేసింది తప్పు సరిదిద్దుకోండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసింది. అసలు ఈ బృందం ఎక్కడిది? ఉన్నఫళంగా ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఎందుకు మద్దతు ఇస్తుంది? అనే ప్రశ్న రాకమానదు.

ఈ బృందంలో ఉన్న ఒక ముగ్గురి పేర్లు చూస్తే వీరి ఉద్దేశం ఏంటో అర్ధం అవుతుంది. ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లం చంద్రబాబు హయాంలోనే రిటైర్ అయ్యి ఆ తరువాత ప్రభుత్వాన్నే విమర్శించారు. ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరించిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఐవైఆర్‌ కృష్ణారావు ఆ తరువాత బీజేపీలో చేరి చంద్రబాబు ప్రభుత్వం మీద అప్పుడప్పుడు పుస్తకాలు, రోజు ట్వీట్లు రాస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ బృందంలో ఉన్న మరొక మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి. ఆయన గతంలో వైఎస్ ప్రభుత్వంలో పని చేసి ఆయనకు అంతరంగికుడిగా పేరొందారు. జగన్ కేసులను విచారించిన సిబిఐ జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణకు ఏ మాత్రం సహకరించలేదు అని ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఆయనను కాపాడుకోవడానికి ఎంతమందిని జగన్ రంగంలోకి దించారో చూస్తే ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కు కావాల్సిన వారో కాదో ఇట్టే అర్ధం అవుతుంది. జగన్ అధికారంలోకి వస్తే ఆయనను సీఎస్ గా కొనసాగించే అవకాశం కూడా ఉందని సమాచారం.