Kutumba-Katha-Chitram-Official-Theatrical-Trailerబుల్లితెరపై ఫుల్ ‘పటాస్’గా రాణిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీముఖి ప్రధాన పాత్రలో నందు హీరోగా తెరకెక్కిన “కుటుంబ కధాచిత్రమ్” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్ ను బట్టి ఇదేదో పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని భావించే వారికి ఈ సినిమా ట్రైలర్ భారీ షాకే ఇస్తోంది.

టైటిల్ ఏమో “కుటుంబ కధాచిత్రమ్” అని పెట్టి, ట్రైలర్ లో సస్పెన్స్ ను చూపించడం విశేషం. అది నిజంగా సస్పెన్స్ గా ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే, ఈ సినిమా అసలు కుటుంబ కధాచిత్రమ్ కాదని మాత్రం స్పష్టం. హార్రర్ అండ్ సస్పెన్స్ క్యాటగిరీలో ఉన్న ఈ సినిమాకు పూర్తి వ్యతిరేకమైన టైటిల్ ను పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో చిత్ర యూనిట్ కే తెలియాలి.

ఇక టైటిల్ ఎలా ఉన్నా, కనీసం సినిమా పరంగా న్యాయం చేసారా? అంటే… ట్రైలర్ అయితే అంతటి నమ్మకాన్ని కలిగించలేకపోయింది. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించేలా ఉండగా, ‘పటాస్’తో యువ హృదయాలను దోచుకున్న శ్రీముఖి చుట్టూ అల్లిన కధ ప్రేక్షకులను ఏ మేరకు నప్పుతుందో చూడాలి.