Kurukshetram-teaser-Talk
మెగాస్టార్ చిరంజీవి మాదిరి తన 150వ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలి అన్న తలంపుతో కాకుండా, కాస్త డిఫరెంట్ గా ట్రెండ్ కు తగిన విధంగా క్రైమ్ థ్రిల్లర్ కధతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఖరారైంది. “కురుక్షేత్రం” పేరుతో తెలుగులో విడుదల అవుతోన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను సండే హంగామాగా విడుదల చేసారు. ఈ సినిమాలో తామేం చూపించబోతున్నామో అన్న విషయాన్ని ఈ టీజర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పేసింది.

ఓ సైకో కిల్లర్ చేసే వరుస హత్యలను చేధించడానికి రంగంలోకి దిగిన ఓ సిన్సీయర్ ఆఫీసర్ రోల్ లో అర్జున్ కనిపించనున్నారు. ఆ సైకో కిల్లర్ ను సదరు పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారు? అన్నదే ఈ సినిమా కధ. ఇలాంటి క్రైమ్ స్టోరీలు రొటీనే అయినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ను కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. ప్రొడక్షన్స్ వాల్యూస్, భారీ తారాగణం సినిమాకు మరో ప్లస్ పాయింట్స్. నవీన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా బాగుంది. టైటిల్ ఒక్కటే… సినిమాకు, కధకు సంబంధం లేనట్లుగా ఉంది..!