Kurnool complete lockdownఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న రాత్రి 6 గంటల నుండి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 266 గా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 56 కేసులు నమోదు అయ్యాయి.

నెల్లూరు (34), గుంటూరు (32) జిల్లాలు తరువాతి స్థానాలలో ఉన్నాయి. మరోవైపు కృష్ణ, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్కటి రెండు మరణాలు సంభవించాయి. కర్నూల్ జిల్లాలో ని కేసుల దృష్ట్యా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మెడికల్ షాపులు మినహా మిగతావన్నీ మూసివేస్తారని నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు తెలంగాణ నిన్నటి రాత్రి చివరి అప్డేట్ ప్రకారం, రాష్ట్రంలో మొత్తం కేసులు 334. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,067 గా ఉంది. అనధికారిక సంఖ్యలు 4300 కన్నా ఎక్కువ ఉంటాయని సమాచారం.

దేశంలో నమోదైన కేసులలో ఎక్కువ భాగం నిజాముద్దీన్ మార్కాజ్ సంఘటనకు సంబంధించినవి. మార్కాజ్ కు హాజరైన వారు, వారి కాంటాక్ట్స్ కు సంబంధించిన టెస్టు రిపోర్టులు ఇంకా రావాల్సి ఉండడంతో ఈ వారంలో కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.