ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన కుప్పం నియోజకవర్గం మునిసిపాలిటీ ఎన్నికలపై ప్రస్తుతం విశ్లేషణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ దీనికి గల కారణాలను అన్వేషిస్తోంది. కుప్పం లెక్కలు బయటకు రావడంతో… వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైసీపీ బొక్కలను వెలికి తీస్తున్నారు.

కుప్పంలో మొత్తం పోలైన ఓట్లల్లో అధికార పార్టీ వైసీపీకి 15692 ఓట్లు రాగా, ప్రతిపక్ష పార్టీ టిడిపికి 12407 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇరు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 3285 ఓట్లు మాత్రమే. ఇక వార్డుల వారీగా వచ్చిన లెక్కలను పరిశీలిస్తే… రిగ్గింగ్ జరిగిందంటూ ముందుగా టిడిపి లేవనెత్తిన వార్డులలో వైసీపీకి భారీ మెజారిటీని సొంతం చేసుకోవడం గమనించదగ్గ అంశం.

మొత్తం 25 వార్డులున్న కుప్పంలో చాలా వార్డులలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు రాగా, 6 వార్డులలో భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ ముందుగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నేడు ఆ 6 వార్డులలో మెజారిటీని పరిశీలిస్తే ఏకపక్షంగా పోలయ్యాయని అర్ధమవుతోంది. వ్యత్యాసం ఉన్న 3285 ఓట్లల్లో అవే కీలకం అయ్యాయని తెలుగుదేశం పార్టీ వర్గాలతో సహా పొలిటికల్ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నారు.