Kuppam Municipal Electionsకుప్పంలో మున్సిపాలిటిలో అధికారపార్టీ అనవసరంగా కెలుక్కుంటుందా? కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు విషయంలో వైసీపీ మొదట్నుంచీ అనవసరపు వివాదాలకు కారణం అవుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

తమకు అనుకూలంగా మార్చుకునే విధానంలో భాగంగా ఒకే ఒక్క వార్డు కోసం చెడ్డపేరు మూటకట్టుకుంటుందన్న ఆవేద ఆ పార్టీ శ్రేణుల్లోనూ ఉందట. ఇంతకుముందు తిరుపతి కార్పొరేషన్ 7వ డివిజిన్ విషయంలోనూ వైసీపీ ఇలాంటి తప్పే చేసింది. దీంలో అక్కడ ఎన్నిక నిలిచిపోయి…వ్యవహారం అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది.

తిరుపతిలాగే కుప్పుంలోనూ అదే సీర్ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోఉంది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి ద్రుష్టి కుప్పంపైన్నే ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ చాలా మొండితనంగా మూర్ఖంగా వ్యవహరిస్తుందన్న అనుమానాలు స్థానిక ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.

14వ వార్డు తెలుగుదేశం అభ్యర్థులు ప్రకాశ్, ఆయన సతీమణి తిరుమగళ్ నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో వైసీపీ ఏకగ్రీమైనట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు.

అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. మేము కుప్పానికి దూరంగా ఉంటే…ఉపసంహరించుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలరామనాయుడు, మాజీమంత్రి అమరనాథ్ రెడ్డితోపాటుగా ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు.

ఒక విధంగా కుప్పం పట్టణంలో తెలుగుదేశంలో శ్రేణుల్లో కసి, పట్టుదల పెంచేలా అధికారపార్టీ చర్యలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక 14వ వార్డు ఏకగ్రీవం అయినట్లు తాము ప్రకటించామని…మీకెమన్న అభ్యంతరం ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలంటూ ఎన్నికల అధికారి చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.

ఒక్క వార్డును వైసీపీకి ఏకగ్రీవం చేస్తే…మున్సిపల్ పీఠం అధికార పార్టీ సొంతం కాదు కదా…మరి ఇలాంటి సందర్భాల్లో వైసీపీ దౌర్జన్యాలకు గుండాయిజానికి పాల్పడుతుందన్న అపవాదు ఎందుకు మూటకట్టుకోవాల్సి వస్తుందో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలి.