Kunduru Jana Reddy Suspended from assemblyతెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేత జానారెడ్డి వివాదరహితుడు అనిపించుకోవాలనో, లేదా రాజకీయ చరమాంకంలో కేసీఆర్ తో గొడవలు ఎందుకు అనుకున్నారో ఏమో గానీ సభలో చాలా వరకు అధికారపక్షానికి అనుకూలంగానే ఉన్నారు. చాలా వివాదాలలో సొంతవారినే విస్మయపరుస్తూ అధికార పక్షానికి సపోర్ట్ చేసిన సంధర్భాలు ఉన్నవి.

చాలా సార్లు కాంగ్రెస్ నేతలే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే జానారెడ్డిని మార్చితే మిగతా నేతలు ఆ పదవికోసం పోటీ పడి మొదటికే మోసం చేస్తారని అధిష్టానం ఆయననే కొనసాగించింది. నిన్న సభలో జరిగిన గొడవలో జానారెడ్డి పాత్ర ఏమీ లేదు. ఆయన ఆయన సీటు లోనే కూర్చుని ఉన్నారు. అయితే ఆయనను కూడా సస్పెండ్ చేసేసింది ప్రభుత్వం.

జానారెడ్డిపై చర్య అకారణంగా ఉందని, జానారెడ్డి నిన్న జరిగిన గొడవపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ,అయినా ఆయనపై సస్పెండ్ వేయడం ఏమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఆయన మీద తనదైన శైలిలో కేసీఆర్ విరుచుకుపడి ఆ విషయాన్నీ మరుగునపరిచారు.