KTR welcome tweet to - narendra modiతెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాని మీ రాష్ట్రానికి రావడానికి ఆసక్తిగా ఉన్నారు ఆ స్థాయిలో ఆరంభానికి సిద్ధంగా ఉన్న ప్రోజెక్టుల వివరణలను తెలపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయం ఒక వర్తమానం పంపింది. అయితే ఏపీ గవర్నమెంట్ అవసరం లేదంటూ జాబు పంపింది.

గతంలో ఆంధ్రకు వచ్చి మట్టి నీరు ఇచ్చినట్టుగా ఏమన్నా చేస్తే ఆ పాపం తమకు కూడా అంటుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం భయపడింది. దీనితో అబ్బె అటువంటి ప్రాజెక్టులు ఏమి లేవు అనేసింది. ఈ వార్త నేటి దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. ఇది చూసి ప్రధాని మెప్పు పొందాలని అనుకున్నారో ఏమో… కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రధానికి పచ్చ తివాచీ పరిచారు.

రేపు హైదరాబాద్ కు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు రాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం అంటూ ఆయన రాకకోసం తామంతా వేచిచూస్తున్నాం అంటూ ఒక ట్వీట్ వదిలారు మంత్రి. ఒకరకంగా మేము మీకు ఉన్నాం అంటూ సిగ్నల్ పంపినట్టుగా ఉంది ఈ ట్విట్టర్ ప్రేమలేఖ. దీనికోసం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అని ఇప్పటిదాకా అని, ఇప్పుడు దానిని కూడా పక్కకు పెట్టారు.