ktr-warns-rana-daggubatiతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ మరియు సినీ నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబు కొడుకు, హీరో రానా మధ్య ట్విట్టర్ లో సాగిన సంభాషణ ఆసక్తిదాయకంగా ఉంది. అసలు ఆ సంభాషణ ఎలా ప్రారంభమైందంటే… రానా తన తండ్రి, నిర్మాత సురేష్ బాబుతో ఒక సెల్ఫీ దిగి, దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఈ నిర్మాతతో తొలిసారి పనిచేస్తున్నా… ఆయనే నాన్న. శుభం జరగాలని మమ్మల్ని విష్ చేయండి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలో చెబుతాను’ అని ట్వీట్ చేశాడు.

ఇక, ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్… ‘నాదో చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్ బాస్ లుగా ఉంటారు/ ఉండొచ్చు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు’ అని అన్నారు. కేటీఆర్ సలహా/హెచ్చరిక కు స్పందించిన రానా… ‘ధ్యాంక్యూ సార్!! అంగీకరించా. అర్థం చేసుకుని అనుసరిస్తా’ అని జవాబిచ్చాడు. సాధారణంగా సినిమాలకు దూరంగా ఉండే కేటీఆర్, ఇలా స్పందించడంతో వీరిద్దరి ట్విట్టర్ హెచ్చరికలు/సలహాలు అభిమానుల నడుమ హాట్ టాపిక్ అయ్యాయి.