KTR - T Harish Raoతెరాస ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ కావడంతో ఆ పార్టీ ఉలిక్కిపడింది. తెరాస ఆవిర్భావం తరువాత కేటీఆర్ నిర్వహణలో తలపెట్టిన మొదటి సభ ఫెయిల్ కావడంతో కేసీఆర్ సహా అందరు ఉలిక్కి పడ్డారు. దీనితో ఆ జ్ఞాపకాలు ప్రజల మది నుండి తీసి వెయ్యడానికి ఈ నెల 7న హుస్నాబాద్‌లో పార్టీ మరో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

ఈ సభ నిర్వహణ బాధ్యతలను కేటీఆర్ కు కాకుండా మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. దీంతో సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 50 వేల మందితో హుస్నాబాద్‌ (సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో) లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 బహిరంగ సభలు నిర్వహిస్తారని సమాచారం.

నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు ఈ సభల ద్వారా వివరించబోతున్నారు. తెరాసను ఆశీర్వదించాలని ప్రజలను కోరతామని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెప్పుకొస్తున్నారు. షికారు చేస్తున్న పుకార్ల ప్రకారం 6వ తేదీన కేసీఆర్ అసెంబ్లీ రద్దును సిఫార్సు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.